దున్నపోతుపై పోలింగ్ సెంటర్‌కు ఓటర్.. ఎందుకో తెలుసా?

దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫోర్త్ ఫేజ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు మొదలు కాగా సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

Update: 2024-05-13 11:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫోర్త్ ఫేజ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు మొదలు కాగా సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విచిత్ర పనులు చేస్తున్నారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రెబల్లె మాజీ సర్పంచ్ గుర్రంపై వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే మరోవ్యక్తి దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.

కొత్తగా ఓటు రావడంతో తన ఫస్ట్ ఓటు మెమొరబుల్‌గా గుర్తుండిపోవాలని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీహార్ రాష్ట్రంలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమస్తిపూర్ జిల్లాలోని ఉజియాపూర్ నియోజకవర్గానికి చెందిన యువకుడు తన ఫస్ట్ ఓటు హక్కు రావడంతో గుర్తుండిపోయేలా దున్నపోతుపై వెళ్లి ఓట్ వేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నల్ల చొక్కా, తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టుకుని దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు. అయితే దున్నపోతుకు కూడా తలపాగా చూట్టడంతో మిగతా ఓటర్లు యువకుడిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

Tags:    

Similar News