ఇస్రో ప్రతి రోజూ 100 సైబర్ దాడులను ఎదుర్కొంటోంది: ISRO chairman Somnath
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ సదస్సులో c0c0n 16వ ఎడిషన్ ముగింపు సమావేశంలో ఎస్ సోమనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. దేశంలోని అంతరిక్ష సంస్థ ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.
అలాగే అత్యాధునిక సాఫ్ట్‌వేర్, చిప్‌లను ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులకు అవకాశం చాలా ఎక్కువ అని అన్నారు. అటువంటి దాడులను ఎదుర్కోవడానికి సంస్థ బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను కలిగి ఉందని ఆయన తెలిపారు. కాగా కేరళ పోలీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం గమనార్హం.