ఇజ్రాయేల్ మిలటరీ చీఫ్ రాజీనామా

ఇజ్రాయేల్‌ను కాపాడలేకపోవడం మిలటరీ వైఫల్యమే, ఇంతటి దారుణమైన దాడికి తన ఆధ్వర్యంలో జరిగిన తప్పదాలు కూడా కారణమే అందుకే రాజీనామా చేస్తున్నానని హర్జీ హలేవీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Update: 2025-01-21 16:31 GMT
ఇజ్రాయేల్ మిలటరీ చీఫ్ రాజీనామా
  • whatsapp icon

- అక్టోబర్ 7న హమాస్ దాడి

- ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా

దిశ, నేషనల్ బ్యూరో:

ఇజ్రాయేల్ మిలటరీ అత్యున్నత అధికారి లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవీ తన పదవికి రాజీనామా చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన ఆకస్మిక దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్, భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంగళవారం పదవీ బాధ్యతలకు రాజీనామా చేశారు. హమాస్ సంస్థ చేసిన అక్టోబర్ 7 నాటి దాడిలో 1200 మంది ఇజ్రాయేలీయులు మృతి చెందారు. వీరిలో అత్యధికులు సాధారణ పౌరులే ఉన్నారు. మరో 250 మందిని హమాస్ బంధీలుగా తీసుకొని పోయింది. హర్జీ హలేవీ రాజీనామా 2025 మార్చి 6 నుంచి అమలులోకి రానుంది. హమాస్ దాడి జరిగిన తర్వాత గాజా స్ట్రిప్‌లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయేల్ యుద్దాన్ని ప్రారంభించింది. తాజాగా మధ్యవర్తుల చర్చలతో హమాస్ కాల్పుల విరమణ ప్రకటించింది.

ఇజ్రాయేల్‌ను కాపాడలేకపోవడం మిలటరీ వైఫల్యమే, ఇంతటి దారుణమైన దాడికి తన ఆధ్వర్యంలో జరిగిన తప్పదాలు కూడా కారణమే అందుకే రాజీనామా చేస్తున్నానని హర్జీ హలేవీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, జనవరి 2023న లెఫ్టినెంట్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన హర్జీకి 2025 డిసెంబర్ వరకు పదవీ కాలం ఉంది. హర్జీ రాజీనామా వార్త బయటకు వచ్చిన సమయంలోనే వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ మీద ఇజ్రాయేల్ దాడికి తెగబడింది. ఈ దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా, 35 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రి తెలిపారు.

Tags:    

Similar News