హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్ని మంచుపర్వాతాల్లో కుప్పకూలిపోయింది.

Update: 2024-05-20 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్ని పర్వాతాల్లో కుప్పకూలిపోయింది. కాగా ఈ సమాచారం అందుకున్న సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టగా హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని కనిపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రణాలతో లేరని.. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటే విదేశాంగ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ జాతీయ మీడియా స్పష్టం చేసింది. కాగా హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో వాతావరణం దారుణంగా ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. 2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే పదే చెప్పేవాడు. అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉక్కుపాదంతో అణచివేశారు. కాగా ఆయన అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. అలాగే దేశ భద్రత చర్యలపై ఆందోళన నెలకొంది


Similar News