ICC Arest Warrant : నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ICC) ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు(Israel PM Benjimin Netanyuhu)పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Update: 2024-11-21 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ICC) ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు(Israel PM Benjimin Netanyuhu)పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గాజా(Gaja)లో యుద్ధ నేరాలు, ఆకలి చావులకు కారణం, మానవత్వానికి వ్యతిరేక చర్యలు, పాల్పడినందుకు నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాట్ మీద ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గాజాలో సాధారణ ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు అందకుండా చేసి.. వారి మరణాలకు కారణం అయ్యారని, వీరి చర్యలకు చిన్నపిల్లలు బాధితులుగా మారారని ఐసీసీ తెలిపింది. వీటన్నిటికీ ఆధారాలు కూడా గుర్తించామని, ఆ తరువాతే చర్యలకు దిగామని కోర్ట్ పేర్కొంది. అయితే ఈ అరెస్ట్ ను నెతన్యాహు ఖండించారు. గాజాలో తాము యుద్ధం మాత్రమే చేస్తున్నామని.. వేరే ఎలాంటి చర్యలకు పాల్పడటం లేదని తెలియ జేశారు. 

Tags:    

Similar News