Adani: అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ అధికారులకు లింక్

కొందరు అధికారులు ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 1,690 కోట్ల లంచాలు తీసుకున్నట్టు బ్రూక్లిన్ కోర్టు ఆరోపణల్లో ఉంది

Update: 2024-11-21 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిలీయనీర్ గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై అమెరికాలోని ఫెడరల్ కోర్టు కేసు నమోదు చేసింది. భారత్‌లో సొలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించి లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వ్యవహారంలో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించడం గమనార్హం. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. 2019-24 మధ్య ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 1,690 కోట్ల లంచాలు తీసుకున్నట్టు బ్రూక్లిన్ కోర్టు ఆరోపణల్లో ఉంది. గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం స్పష్టం చేసింది. అదే ఏడాది విదేశీ అధికారులతో ఆంధ్రప్రదేశ్‌లోనే గౌతమ్ అదానీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాయని, ఈ ఒప్పందం కోసం ప్రభుత్వంలోని ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు కమిషన్ పేర్కొంది. అధికారులకు లంచం ఇవ్వడంపై హామీ ఇచ్చిన తర్వాత అదానీ గ్రీన్, అజూర్ కమ్యూనికేషన్‌లు ఒప్పందం ఖరారు చేశాయి. అదానీ గ్రీన్, అజూర్‌లకు నేరుగా ప్రయోజనం చేకూర్చే విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని ఎస్ఈసీఐతో అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా' అంగీకరించిందని అమెరికా అధికారులు ఆరోపించారు.

Tags:    

Similar News