వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో, మహిళా మద్దతుదారుల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో, మహిళా మద్దతుదారుల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఒక శివశక్తి పాయింట్ చంద్రుడిపై ఉంది, మరొకటి కాశీలో ఉందన్నారు. నేడు భారత్ సాధించిన విజయానికి (చంద్రయాన్-3 విజయంపై) తాను మరోసారి దేశప్రజలను అభినందిస్తున్నానని తెలిపారు. కాశీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో ఇక్కడి క్రీడాకారులకు మేలు జరుగుతుందని, పూర్వాంచల్ యువతకు వరంగా మారనుందన్నారు.
క్రికెట్‌లో ప్రపంచం మొత్తం భారత్‌తో ముడిపడి ఉందన్నారు. 'మహాదేవ్' నగరంలోని ఈ స్టేడియం ఉన్నందున 'మహాదేవ్'కు అంకితం చేస్తున్నానని తెలిపారు. క్రీడల్లో భారత్ విజయాలు సాధిస్తోందని, కేంద్రం ప్రతి స్థాయి క్రీడాకారులకు సహాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూ.121 కోట్ల స్థలంలో నిర్మించనున్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ. 330 కోట్లు వెచ్చించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.