Bangladesh: బంగ్లాలో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు

అంతా సవ్యంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజలు చెబుతున్నారు

Update: 2024-08-08 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభ పరిణామాల తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, తాత్కాలిక ప్రభుతం ఏర్పడినప్పటికీ దేశంలో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కొన్నిచోట్ల ఉద్రిక్తతలు ఉన్నాయి, కానీ అంతా సవ్యంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజలు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇకపై అంతా సర్దుకుంటుందని కొందరన్నారు. సామాన్య ప్రజలు సాధారణ పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నారు. కొన్నిచోట్ల దాడులు, లూటీల కారణంగా సామాన్య ప్రజలు, స్థానిక యువత గుంపులు గుంపులుగా రాత్రుళ్లు వీధుల్లో కాపలా కాస్తున్నారు. కాగా, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశం విడిచిపెట్టిన మూడు రోజుల తర్వాత, ఆగస్టు 8 రాత్రి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ముహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ పౌరులందరికి భద్రత అందించేలా ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని మహ్మద్ యూనస్ అన్నారు. ముహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ బహుమతి అందుకున్నారు. బంగ్లాదేశ్ సామాజిక వ్యవస్థాపకుడు, గ్రామీణ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మైక్రోక్రెడిట్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేశారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన 17 మంది సభ్యులు గురువారం ఢాకాలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు బంగ్లాదేశ్‌ దినపత్రిక ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.

Tags:    

Similar News