రాష్ట్రాన్ని కించపరిస్తే సహించేది లేదు: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరిక

నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా బాధపడను. కానీ రాష్ట్రాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు’ అని మమతా బెనర్జీ హెచ్చరించారు.

Update: 2024-01-08 09:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా బాధపడను. కానీ రాష్ట్రాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. సోమవారం కోల్‌కతాలో విద్యార్థులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈడీ అధికారుల దాడుల నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రశ్నిస్తున్న వారు రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం కోల్‌కతా దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఎంపికైందని గుర్తు చేశారు. కొందరు తమ వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అది సరైన పద్దతి కాదని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. కాగా, రేషన్ స్కామ్‌లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇంటిపై తనిఖీలు చేయడానికి వెళ్తుండగా..ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే మమత వారికి కౌంటర్ ఇచ్చింది. 

Tags:    

Similar News