Rahul Gandhi : మీ గురించి కాదు.. వయనాడ్ గురించి ఆలోచించండి.. రాహుల్‌‌కు సీఎం హిమంత సూచన

దిశ, నేషనల్ బ్యూరో : తనపై రైడ్స్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్లాన్ చేస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ఘాటుగా స్పందించారు.

Update: 2024-08-02 18:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తనపై రైడ్స్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్లాన్ చేస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తన గురించి తాను ఆలోచించుకోవడం మానేసి.. సొంత నియోజకవర్గం వయనాడ్‌లోని ప్రజల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో ఆర్తనాదాలు చేస్తున్న వయనాడ్‌లోని బాధిత కుటుంబాల గురించి ఆలోచించాలని రాహుల్‌కు సీఎం హిమంత సూచించారు.

వచ్చే ఏడాది జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రోజూ 24 గంటలపాటు పార్టీ కోసం పనిచేయడం ఒక్కటే విజయ రహస్యమని ఆయన స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో బీజేపీ వ్యవహారాల కో ఇన్‌ఛార్జిగా ఉన్న అసోం సీఎం హిమంత శుక్రవారం రాంచీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News