సైబర్‌ నేరాలపై పోరాటం కోసం బెంగళూరు పోలీసులకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసినట్లు తెలిపింది.

Update: 2024-04-10 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ సైబర్ నేరాలను అరికట్టేందుకు బెంగళూరు పోలీసులకు భారీ విరాణం ప్రకటించింది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సీఎస్ఆర్ విభాగం బుధవారం తెలిపింది. దీనికి సంబంధించి బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలోని సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్స్(సీసీఇటీఆర్) సహకారాన్ని పునరుద్ధరణకు సీఐడీ, డేటా సెక్యూరీటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూపై సంతకాలు చేశాయి. సీసీఇటీఆర్ భాగస్వామ్యం మరో నాలుగేళ్లు కొనసాగడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దర్యాపు సామర్థ్యం పటిష్టమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసుల సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను ఈ ఎంఓయూ బలోపేతం చేస్తుంది.  

Tags:    

Similar News