Union Budget 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామని వరుసగా ఏడోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Update: 2024-07-23 05:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి నిర్మలా సీతారామని వరుసగా ఏడోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ “మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా.. 4 అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. కనీసం 50 శాతం ఖర్చుతో కూడిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన వల్ల 80 కోట్లమందికి ప్రయోజనం చేకూరిందన్నారు. భారత ఆర్థిక వృద్ధి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోని ఆర్థిక వృద్ధి దూసుకుపోతుందన్నారు. దేశ ద్రవ్యోల్బణం స్థిరంగా.. ప్రస్తుతం 4 శాతంగా ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు సులభతరం చేసేందుకు ఐదు పథకాలు ప్యాకేజీలను కేంద్రం ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించారు.

Read More : కేంద్ర బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

Tags:    

Similar News