Air Defence: 2026 నాటికి గాల్లోకి ఎగురనున్న ఎల్‌సీఏ మార్క్ 2 ఫైటర్ జెట్

భారత ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ 2035 కల్లా మొదలవుతుందని అధికారులు వెల్లడించారు

Update: 2024-08-11 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వదేశీ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి డిఫెన్స్ అధికారులు కీలక ప్రకటన చేశారు. 4.5 జనరేషన్ ప్లస్ ఎల్‌సీఏ మార్క్ 2 ఫైటర్ జెట్‌లు 2026, మార్చి నాటికి గాల్లోకి ఎగరనున్నాయి. అంతేకాకుండా 2029 నాటికి వాటి ఉత్పత్తి భారీ ఎత్తున ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక, భారత ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ 2035 కల్లా మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. డీఆర్‌డీఓ చైర్మన్ డా సమీర్ వి కామత్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అధ్యక్షతన జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఆలస్యమైందని, ఏడాది క్రితమే జరగాల్సింది అని అన్నారు. 2025 ప్రారంభం నాటికి దీని ప్రోటోటైప్ సిద్ధమవుతుందని అన్నారు. స్వదేశీ యుద్ధవిమానం కోసం ఇంజిన్‌ల ఒప్పందంపై సంతకం చేయడంతో ముడిపడి ఉన్నందున నిధుల విడుదలలో జాప్యం జరిగింది. అందువల్ల ఆలస్యమైంది. అన్ని ఎల్‌సీఏ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అమెరికన్ జీఈ ఇంజిన్‌లతో పనిచేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అమెరికా సంస్థ ద్వారా దేశంలోనే తయారు కానున్నాయని వెల్లడించారు.

Tags:    

Similar News