Indian Weapons to America: జయహో భారత్.. అమెరికాకు ఆయుధాల ఎగుమతి

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా అగ్రదేశమైన అమెరికా (America)కు సైతం ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది భారత్

Update: 2024-10-28 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా అగ్రదేశమైన అమెరికా (America)కు సైతం ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది భారత్ (India). ఒక్క 2023-24లోనే మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ విలువ ఏకంగా రూ.21,083 కోట్లకు చేరుకుంది. ఇక దాదాపు 100 దేశాలకు మన దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. అందులో ఫ్రాన్స్ (France), ఆర్మేనియా (Armenia)లతో అగ్రరాజ్యం అమెరికా టాప్‌లో ఉండడం విశేషం. అంటే ఈ మూడు దేశాల మన టాప్ 3 కస్టమర్లన్నమాట. ఇక ఈ దేశాలు అత్యధికంగా మన నుంచి బ్రహ్మోస్ (Brahmos), ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ (Akash Air Deffence Missile System), పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ (Pinaka Multi Launch Rocket System), 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌ను మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా మన దేశం నుంచి స్నైపర్ రైఫిల్స్ (sniper riffiles), బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ (bulletproof Jackets) వార్ హెల్మెట్స్ (War helmets), ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (electronic items), ఆర్మర్డ్ వెహికల్స్ (armoured vehicles), లైట్ వెయిట్ టోర్పిడోస్ (lightweight torpedoes), సిమ్యులేటర్స్ (simulators), డ్రోన్స్ (drones), ఫాస్ట్ అటాక్ వెస్సెల్స్ (fast-attack vessels) దిగుమతి చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే గత 10 ఏళ్ల భారత్ ఆయుధాల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. సులభమైన లైసెన్సింగ్ ప్రక్రియ, వినియోగించడానికి అనువుగా ఉండడంతో మన ఆయుధాలకు ప్రపంచ దేశాల్లో నానాటికీ డిమాండ్ పెరుగుతోంది. 2024-25 వార్షిక లెక్కల ఆధారంగా ఇప్పటికే 6 వేల కోట్లకు పైగా విలువ గల ఆయుధాలను భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. గతేడాది రూ.3 వేల కోట్లతో పోల్చితే రెట్టింపన్నమాట.


Similar News