Indian man short dead: అమెరికాలో ఆగ్రా యువకుడి కాల్చివేత.. భార్య ఎదుటే దారుణం

అమెరికాలో భారత సంతతికి చెందిన గేవిన్ డసౌర్(29) అనే యువకుడిని అతని భార్య ముందే కాల్చి చంపారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన గొడవ ఈ ఘటనకు దారితీసింది.

Update: 2024-07-21 14:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత సంతతికి చెందిన గేవిన్ డసౌర్(29) అనే యువకుడిని అతని భార్య ముందే కాల్చి చంపారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన గొడవ ఈ ఘటనకు దారితీసింది. ఇండియానా సిటీ పోలిస్ డిపార్ట్‌మెంట్ అధికారి అమండా హిబ్ష్‌మాన్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన డసౌర్ యూఎస్‌లోని ఇండియానాలో నివాసం ఉంటున్నారు. జూన్ 29న మెక్సికోకు చెందిన యువతి వివియానా జమోరాను వివాహం చేసుకున్నారు. అయితే ఈ నెల 16న తన భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా..ఇండియానా నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో వాహనదారుడితో ఘర్షణ జరిగింది. దీంతో తన వెనుక ఉన్న కారు వద్దకు డసౌర్ ఆగ్రహంతో వెళ్లి డోర్ తీయాలని అరిచారు. ఈ క్రమంలోనే కారులో లోపల ఉన్న వ్యక్తి డసౌర్ పై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News