దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి.. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-03 10:14 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరగుతుందని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. పెగాసెస్ స్పైవేర్‌ను తనపై ఉపయోగించారని మరోసారి ఆరోపించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో తాజాగా ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్‌వర్క్ నిర్బంధంగా మారుతోందన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు.

తనపై స్పైవేర్ ఉపయోగించారని, పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు కూడా దీనికి బాధితులయ్యారని చెప్పారు. ప్రభుత్వం మీడియా, న్యాయవ్యవస్థను నియంత్రించడం, నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడటం వంటి వాటికి పాల్పడుతుందని ఆరోపించారు. పలు సమస్యలపై పార్లమెంటు ముందు నిలబడి ప్రశ్నించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారని తన ఫోటోలను చూపించారు. రాజ్యాంగంలో రాష్ట్రాల కలయికే భారత్ అని రాసి ఉంది. అయితే ఈ ఐక్యతకు చర్చలు, సంప్రదింపులు అవసరం. అలాంటి చర్చలపై దాడి చేస్తూ బెదిరింపులకు గురవుతున్నాయి’ అని తెలిపారు.

జోడో యాత్రలో ఉగ్రవాదిని చూశాను..

భారత్ జోడో యాత్ర జమ్ములో ప్రవేశించిన తర్వాత ఉగ్రదాడులు జరుగుతాయనే భయంతో యాత్రను ఆపమని బలగాలు కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ తాను కొనసాగించానని అన్నారు. ప్రజల కష్టాలు వినేందుకు కాంగ్రెస్ నేతలు నిజంగానే కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చారా అని ఆ వ్యక్తి తనను ప్రశ్నించాడని రాహుల్ గాంధీ అన్నారు. ఆ తర్వాత కొందరి వైపు చూపించి వారిని ఉగ్రవాదులని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో ప్రమాదం లో ఉన్నానని, ఉగ్రవాదుల తనను చంపేస్తారని అనుకున్నట్లు చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేదు ఎందుకంటే ఇది వినడానికి ఉన్న శక్తి అని అన్నారు.

Tags:    

Similar News