చైనాకు షాకిచ్చిన భారత్.. పాంగాంగ్ లేక్‌లో దడపుట్టించే ప్రదర్శన! (వీడియో)
పదాతిదళ పోరాట వాహనాలను కూడా రక్షణ మంత్రి అందజేశారు. Indian Army showcased the capability of the Landing Craft Assault.
దిశ, వెబ్‌డెస్క్ః ఇప్పటికే భారత్, చైనాల మధ్య పలు సరిహద్దు ఘర్షణలు నెలకొన్నాయి. వీటిల్లో పాంగాంగ్ లేక్ బోర్డర్ ప్రాంతం కీలకంగా నిలుస్తోంది. ఈ నేపధ్యంలో భారత సైన్యం మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. చైనా, భారత సరిహద్దు అయిన వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దగ్గరున్న పాంగాంగ్ లేక్‌లో 'ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్' సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో LAC దగ్గర రక్షణగా ఉన్న భారత సైనిక బలగం పాల్గొన్నారు. పాంగాంగ్ సరస్సులో మోహరించిన ఈ పడవలు ఒకేసారి 35 మంది పోరాట దళాలను మోసుకెళ్లగలవు. అలాగే, అవి సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేరుకోగలవు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తుండగా, మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యుద్ధ పడవలను సైన్యానికి అందజేశారు. దీనితో పాటు, LAC వెంట ఉన్న ఫార్వర్డ్ ప్రాంతాల్లో శత్రు సేనలపై ఒక కన్ను వేయడానికి, సైనికుల కోసం స్వదేశీంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థను కూడా భారత సైన్యం అందుకుంది. ఇక, ఫార్వర్డ్ ఏరియాల్లో మోహరించిన సైనికులకు 'మేడ్ ఇన్ ఇండియా' పదాతిదళ పోరాట వాహనాలను కూడా రక్షణ మంత్రి అందజేశారు.