Telecom: 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్న స్వదేశీ టెలికాం పరికరాలు

భారత ఆర్మీ కూడా తొలి దేశీయ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది

Update: 2024-07-30 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో తయారైన టెలికాం పరికరాలు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది 18.2 బిలియన్ డాలర్ల(రూ. 1.52 లక్షల కోట్ల) కంటే ఎక్కువ విలువైన టెలికాం పరికరాలు, సేవల ఎగుమతి జరిగింది. 'అంతర్జాతీయ మార్కెట్లో పోటీ ఉన్నప్పటికీ స్వదేశీ టెలికాం కంపెనీలు అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలలో సామర్థ్యాన్ని, తమదైన ముద్రను వేస్తున్నాయని ' టెలికాం విభాగం, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మెంబర్ (టెక్నాలజీ) మధు అరోరా చెప్పారు. ఈ మధ్యే భారత ఆర్మీ కూడా తొలి దేశీయ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, స్వంత ఆర్అండ్‌డీని అభివృద్ధి చేశాయని ఆయన వెల్లడించారు. డిఫెన్స్ సెక్టార్ ఐసీటీ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆయన.. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఐసీటీ) రక్షణ రంగ కార్యకలాపాలకు వెన్నెముకగా నిలుస్తుందని అన్నారు. ఇన్నోవేషన్ ద్వారా భారత ఐసీటీ రంగం గడిచిన దశాబ్ద కాలంలో మెరుగైన ఉనికిని కలిగి ఉందన్నారు. ఇదే సమావేశంలో మాట్లాడిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అభివ్షేక్ సింగ్, ఐసీటీ రంగంలో ఆఫ్రికాతో సహకారం కోసం పనిచేస్తున్నామని చెప్పారు.  

Tags:    

Similar News