‘సంఘ్‌’కు బానిసలు కావడానికే స్వాతంత్య్రం తెచ్చుకున్నామా ? : రాహుల్

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.

Update: 2024-04-15 11:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘‘ఆనాడు భారత దేశం బ్రిటీష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం పొందింది.. ఈనాడు సంఘ్ పరివార్ భావజాలానికి బానిసగా మారేందుకు కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలోని వయనాడ్‌లో పార్టీ కార్యకర్తలు, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ‘‘ఈ దేశాన్ని పాలించే హక్కు భరతమాత బిడ్డలందరికీ సరిసమానంగా ఉంది. కానీ ప్రధాని మోడీ ఒకే దేశం, ఒక భాష, ఒకే నాయకుడి గురించి కలలు కంటున్నారు’’ అని ఆయన విమర్శించారు. ‘‘ఒక చిన్న పిల్లవాడు, అమ్మాయి ఎందుకు నాయకులుగా మారకూడదు. ఆటోరిక్షా తొక్కే మా సోదరుడు ఎందుకు నాయకుడు కాలేడు? మన పోలీసులు ఎందుకు నాయకులు కాలేరు ? అందరికీ అవకాశాలు దక్కాలనే అంశానికే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ ఆలోచనా విధానమే కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమని ఆయన వివరించారు. ‘‘దేశ ప్రజల మాట వినాలని.. వారి విశ్వాసాలు, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వాల ద్వారా ఈ వ్యవహారాల్లో కలుగజేసుకుంటోంది’’ అని రాహుల్ ఆరోపించారు. అంతకుముందు వయనాడ్‌లో రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు.

Tags:    

Similar News