UN: ఐక్యరాజ్యసమితిలో భద్రతా సంస్కరణలు అవసరం- భారత్

ఐక్యరాజ్యసమితి(UN) భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను యూఎస్ లో భారత శాశ్వత ప్రతినిధి(India's Permanent Representative to the UN) పర్వతనేని హరీశ్ నొక్కి చెప్పారు.

Update: 2024-11-12 04:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి(UN) భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను యూఎస్ లో భారత శాశ్వత ప్రతినిధి(India's Permanent Representative to the UN) పర్వతనేని హరీశ్ నొక్కి చెప్పారు. న్యూయార్క్(New York) లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని గుర్తుచేశారు. దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. 1965 నుండి గణనీయమైన మార్పులు లేవని పేర్కొన్నారు. భారత్‌కు(India) శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్‌ కోరారు. ‘‘మేం(భారత్‌) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్‌ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ’’ అని అన్నారు.

1965లో చివరిసారిగా..

ఇకపోతే, 1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించారని హరీష్ గుర్తుచేశారు. “సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం అనేవి ప్రధాన సమస్యలు. అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారేళ్ల నుంచి ప్రకటనలు ఇవ్వడం, చర్చల జరపడానికి మాత్రమే పరిమితమయ్యింది. నిర్దిష్టమైన ముగింపులేమీ లేవు. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం ’’ అని అన్నారు.

Tags:    

Similar News