మత ఆధారిత రిజర్వేషన్లకు ఇండియా కూటమి రాజ్యాంగాన్ని మారుస్తుంది: ప్రధాని మోడీ

ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేసి, వాటిని ముస్లింలకు ఇస్తాయి.

Update: 2024-05-26 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తాయని, దేశంలోని మెజారిటీ కమ్యూనిటీని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలని భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీలోని పూర్వాంచల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేసి, వాటిని ముస్లింలకు ఇస్తాయి. ఇండియా కూటమి పార్టీలు వివిధ కులాలను తమలో తాము తన్నుకునేలా చేస్తున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్యం కలిగిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కొన్నేళ్లుగా పూర్వాంచల్‌ను నిర్లక్ష్యం చేశాయని, ఈ ప్రాంతాన్ని మాఫియా, పేదరికం, నిస్సహాయ ప్రాంతంగా మార్చాయని ఆరోపించారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కులాలను బలహీనపరిచేందుకు తమలో తాము కొట్లాడుకునేలా చేస్తున్నాయని, తద్వారా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్నాయన్నారు. 'నేను ఇండియా కూటమి చేస్తున్న ఈ భారీ కుట్ర గురించి పూర్వాంచల్, ఘోసీ ప్రజలను అప్రమత్తం చేసేందుకు వచ్చాను ' అని మోడీ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి రాత్రికి రాత్రే ముస్లి కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారు. ఇటీవల కలకత్తా హైకోర్టు 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించిందని మోడీ పేర్కొన్నారు.  

Tags:    

Similar News