India bloc: ఇండియా కూటమిలో చేరండి.. నటుడు విజయ్‌కి కాంగ్రెస్ ఆఫర్

తమిళ వెట్రి కజగం ( టీవీకే) చీఫ్ పేరుతో నటుడు విజయ్ ఇటీవల నూతన పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-01-19 18:18 GMT
India bloc: ఇండియా కూటమిలో చేరండి.. నటుడు విజయ్‌కి కాంగ్రెస్ ఆఫర్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: తమిళ వెట్రి కజగం ( Tvk) పేరుతో నటుడు విజయ్ ఇటీవల నూతన పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే విజయ్ ఇండియా కూటమిలో చేరాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై ఆహ్వానించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ‘విజయ్ మతపరమైన, హిందూత్వ శక్తుల గురించి ఇటీవల ఓ ప్రసంగంలో మాట్లాడారు. ఆయన నిజంగా అలాంటి అంశాలను నిర్మూలించాలని కోరుకుంటే ఇండియా కూటమిలో చేరాలి. ఇది ఆయనకు, దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశ పౌరుడిగా నా హృదయ పూర్వక సూచన’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కాంగ్రెస్ కొంత నమ్మకం ఉంచాలని కోరారు.

Tags:    

Similar News