Supreme Court: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ (RG Kar Medical College) మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు సుప్రీంకోర్టులో(Supreme Court) చుక్కెదురైంది.

Update: 2024-09-06 08:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ (RG Kar Medical College) మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు సుప్రీంకోర్టులో(Supreme Court) చుక్కెదురైంది. ట్రైనీ డాక్టర్ కేసు విచారణను సీబీఐకి(CBI) బదిలీ చేసిన కలకత్తా హైకోర్టు(Calcutta High Court).. సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణల(corruption case) కేసును కూడా కేంద్ర ఏజెన్సీకే అప్పగించింది. కాగా.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సందీప్‌ ఘోష్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య దర్శాసనం విచారణ చేపట్టింది. మాజీ ప్రిన్సిపల్ అభ్యర్థనను కొట్టివేసింది. ఆర్జీ కర్‌ హాస్పిటల్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ లో భాగస్వామిగా చేర్చుకోవాలన్ని ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ‘ఒక కేసులో నిందితుడిగా ఉన్న మీకు.. కలకత్తా హైకోర్టు విచారణ జరుపుతున్న పిటిషన్‌లో జోక్యం చేసుకునే హక్కు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుప్రీం కోర్టు ఏమందంటే?

ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం(Kolkata Rape-Murder Case) కేసులోనే అవినీతి ఆరోపణలను అనుసంధానిస్తూ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. 2021 నుంచి సందీప్‌ ఘోష్‌ ఆర్జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం సీబీఐ సందీప్ ని అఱెస్టు చేసింది. కోర్టు ఎనిమిది రోజుల కస్టడీ విధించింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఘోష్‌ నివాసంపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు చేసింది.


Similar News