పారిపోతున్న ఉగ్రవాది.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఇండియన్ ఆర్మీ.. వీడియో వైరల్

ఓ ఉగ్రవాది పారిపోతుంటే ఇండియా ఆర్మీ (Indian Army) వెంటపడి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.

Update: 2024-09-16 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఉగ్రవాది పారిపోతుంటే ఇండియా ఆర్మీ (Indian Army) వెంటపడి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పర్యటనకు ముందు బారాముల్లాలో అలర్ట్ అయిన ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే బారాముల్లా చాక్‌ తాప్పర్‌ క్రెరీలో జరిగిన శనివారం రాత్రి భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ ఉగ్రవాది దాక్కున్న బిల్డింగ్‌పై కూడా డ్రోన్ (Drone) సహాయంతో ఇండియన్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ఆ ఉగ్రవాది ప్రాణభయంతో బయటకు పారిపోవడానికి ట్రై చేశాడు. ఏకే 47 రైఫిల్‌తో డ్రోన్‌ని కూల్చేందుకు కాల్పులు జరుపుతూ బిల్డింగ్ నుంచి బయటకు పరిగెత్తి పొదల్లో దాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ అతడిని వెంటాడి వేటాడింది భారత సైన్యం. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమందా తూటాల శబ్దంతో మారుమోగింది.

కాగా.. జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ వైపు నుంచి ఉగ్ర చొరబాటు ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయి. గత వారం రోజుల్లో 3 సార్లు ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారని, గత ఏడు రోజుల్లో నౌషేరా సెక్టార్‌, పూంఛ్‌-దిగ్వార్‌, ఉదంపూర్‌, జమ్మూలోని కనాచక్‌ చొరబాట్లకు యత్నాలు జరిగాయని ఆర్మీ తెలిపింది. ఇక వీళ్లే కాకుండా మరో 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు (Terrorists) ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. వీరి చొరబాట్లకు వీలుగా పాక్‌ సైన్యం, రేంజర్లు సహకరిస్తున్నారని ఆరోపించింది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 18న జమ్మూ కశ్మీర్‌లో 24 స్థానాల్లో తొలివిడత ఎన్నికలు (First Phase Elections) జరగనుండగా.. ఈ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఇప్పటికే బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా అక్కడ పర్యటిస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.



Similar News