LK అద్వానీ జీవితంలో అత్యంత కీలక ఘట్టాలివే!
భారత దేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన బీజేపీ వ్యవస్థాపన సభ్యుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన బీజేపీ వ్యవస్థాపన సభ్యుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అద్వానీ జీవితంలోకి కీలక ఘట్టాలను బీజేపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. 2002లో దేశానికి ఉప ప్రధానిగా పచేశారు. 2004లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2007లో ప్రధాని అభ్యర్థిగా పార్టీ అద్వానీ పేరును సూచించింది. 2008లో ‘మై కంట్రీ, మై లైఫ్’ పేరుతో స్వీయ చరిత్ర విడుదల చేశారు. వీటన్నిటి కంటే ఆయన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన జన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో తాను రథయాత్ర చేపట్టారు.
Read More: BJP అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న