IMD : వయనాడ్‌కు 24 గంటల్లో భారీ వర్షసూచన.. ఐఎండీ అంచనాలతో అలర్ట్

దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు, క్లౌడ్ బరస్ట్ ఘటనలతో కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికే చితికిపోయాయి.

Update: 2024-08-15 19:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు, క్లౌడ్ బరస్ట్ ఘటనలతో కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికే చితికిపోయాయి. అలాంటి జిల్లాకు తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మరోసారి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. కోజికోడ్ జిల్లాకు కూడా ఇదే తరహాలో భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వెల్లడించింది.

కేరళలోని మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీకి ఈనెల 18 నుంచి 20 వరకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను ఇష్యూ చేసింది. ఈ వారంలో వర్షసూచన ఉన్న రాష్ట్రాల జాబితాలో ఒడిశా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News