ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు

గత కొద్ది రోజులుగా ఉత్తరాదిని వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి.

Update: 2024-08-11 14:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్ది రోజులుగా ఉత్తరాదిని వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలతో పాటు, ఆకస్మిక వరదల ముప్పు కూడా పొంచి ఉందని పేర్కొంది. మరోవైపు జమ్మూ, కాశ్మీర్ ఢిల్లీలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, రాజస్థాన్ లోని అనేక జిల్లాలు వరదల్లో మునిగి పోయాయి. వేల ఎకరాల్లో పంటలు చెరువులను తలపిస్తున్నాయి. నర్మదా పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఢిల్లీ, యూపీ రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. అలాగే దక్షిణాదిన కేరళ, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలకు కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొంది.  


Similar News