మోడీ మళ్లీ వస్తే దేశంలో చీకటి రోజులే: ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఓడించకపోతే దేశంలో చీకటి రోజులే వస్తాయని శివసేన (యూబీటీ) చీఫ్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు.

Update: 2024-05-12 10:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఓడించకపోతే దేశంలో చీకటి రోజులే వస్తాయని శివసేన(యూబీటీ) చీఫ్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. దేశంలో అచ్చేదిన్ ఎప్పుడూ రాలేదని మోడీ ఉన్నంత వరకు అది రాదని తెలిపారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడిస్తే దేశ భవిష్యత్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మనుగడ సాధించగలుతుంది. లేకపోతే దేశంలో బ్లాక్ డేస్ వస్తాయి’ అని చెప్పారు. మోడీ హామీలు అవినీతి పరులకు రక్షణ కల్పించడానికి మాత్రమే ఉద్దేశించినవని ఆరోపించారు.

‘దేశంలోని ఇతర రాజకీయ పార్టీలన్నీ అవినీతి పరుల నుంచి ప్రక్షాళన చేయబడుతున్నాయి. ఎందుకంటే వారందరినీ బీజేపీ గూటికి చేర్చి రక్షణ కల్పిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, శివసేనలు ఇప్పటికే అవినీతి పరుల నుంచి విముక్తి పొందాయన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల గురించి అడిగిన ప్రశ్నకు థాక్రే బదులిస్తూ..ప్రతిపక్షాలు భారతదేశం గురించి మాట్లాడుతుండగా, ప్రధాని మాత్రం పదే పదే పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. అభివృద్ధి విషయంలో మాట్లాడితే అధికార పార్టీకి ఒరిగేదేమీ లేదన్న కారణంగానే బీజేపీ ఎన్నికల ప్రసంగంలో రాముడి ప్రస్తావన తీసుకొస్తుందని ఆరోపించారు.

Tags:    

Similar News