అక్కడి నుంచే మణిపూర్‌కూ వెళ్లండి.. ప్రధానికి కాంగ్రెస్ సూచన
దిశ, నేషనల్ బ్యూరో : హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను వదిలేసి.. పొరుగునే ఉన్న అసోంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను వదిలేసి.. పొరుగునే ఉన్న అసోంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా విరుచుకుపడ్డారు. అసోంలోని గువహటి నుంచి మణిపూర్‌లోని ఇంఫాల్‌కు ఆదివారం రోజు నడిచే విమాన సర్వీసుల సమాచారంతో కూడిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన షేర్ చేశారు. ‘‘ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అసోం సీఎం హిమంత బిస్వశర్మ మీ కోసం హెలికాప్టర్‌ను బుక్ చేయగలిగితే మరీ మంచిది. లేదంటే గువహటి (అసోం) - ఇంఫాల్ (మణిపూర్) రూట్‌లో నడిచే విమానాల లిస్టు ఇక్కడుంది. ఏదైనా సమాచారం అవసరమైతే మాకు తెలియజేయండి. బుకింగ్ చేసుకోండి’’ అని సూచిస్తూ పవన్ ఖేరా ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని మోడీకి అసోంలోని గువహటిలో రోడ్ షో చేసే తీరిక ఉంది. కానీ మణిపూర్‌లో పర్యటించే టైం లేదు. మణిపూర్ హింసపై 9 నెలలుగా ప్రధాని మోడీ పాటిస్తున్న మౌనం.. ఆ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయానికి ప్రతీక’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో బీజేపీ గల్లంతైందని విమర్శించారు.
Read More..
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి