1 కిలోల మటన్‌ పంచిపెట్టినా కూడా ఓడిపోయాను: Nitin Gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర రాజ్య శిక్షక్ పరిషత్ నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Update: 2023-07-25 08:59 GMT
1 కిలోల మటన్‌ పంచిపెట్టినా కూడా ఓడిపోయాను: Nitin Gadkari
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర రాజ్య శిక్షక్ పరిషత్ నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ఓటర్లు చాలా తెలివిగా మారిపోయారిని అన్నారు. తాను గతంలో ఓటర్లకు ఒక్కొక్కరికి ఒక కేజీ మటన్ పంపిణీ చేశారని, అయితే ఎన్నికల్లో ఓడిపోయానని అన్నారు. కానీ రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించగలిగి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. బ్యానర్లు, పోస్టర్లకు ఖర్చు లేకుండా విజయం సాధించవచ్చని కేంద్ర మంత్రి యువతకు సందేశమిచ్చారు.

Tags:    

Similar News