మనుషులు రంగు మారడం చూశాను.. రాహుల్ కుటుంబాన్నే మార్చారు: స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Update: 2024-04-12 07:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ అమేథీ ప్రజలను విస్మరించి వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 15 ఏళ్లుగా అమేథీ ప్రజలు రాహుల్‌ను మోస్తే, గెలిచాక ఏ పని చేయని పనికిమాలిన ఎంపీ కనిపించకుండా పోయారని స్మృతి ఇరానీ అన్నారు. ఇన్నాళ్లు అమేథీ తన కుటుంబమని చెప్పిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. వాయనాడ్‌ తన సొంత ఇల్లు అయితే మరి అమేథీ ఏమిటో ఇప్పుడు ఆయన స్పష్టం చేస్తారా? మనుషులు రంగు మారడం చూశాను. రాహుల్ గాంధీ తన కుటుంబాన్ని మార్చడం ఇదే తొలిసారి, ఇప్పుడు ఆయన అమేథీ విధేయతను నిందిస్తున్నారని ఇరానీ తీవ్రస్థాయిలో రాహుల్‌పై విరుచుకుపడ్డారు.

2014లో ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో స్మృతి ఇరానీని ఓడించి మూడోసారి గెలిచారు. రాహుల్‌కు 46.72% ఓట్లు రాగా, ఇరానీకి 34.39% ఓట్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు. ఆమెకు 49.71% ఓట్లు రాగా, రాహుల్‌కు 43.86% ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా స్మృతి ఇరానీ అమేథీలో ఎన్నికల బరిలో ఉండగా, రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు.


Similar News