‘‘మా నాన్న శరీర భాగాల్ని ఇంటికి తెచ్చారు’’.. ప్రియాంకాగాంధీ ఎమోషనల్

దిశ, నేషనల్ బ్యూరో : తాను చాలామంది ప్రధాన మంత్రులను చూశానంటూ ప్రియాంకాగాంధీ భావోద్వేగానికి లోనయ్యారు.

Update: 2024-04-27 18:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తాను చాలామంది ప్రధాన మంత్రులను చూశానంటూ ప్రియాంకాగాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంతగడ్డ గుజరాత్‌లోని వల్సాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ధరంపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. మా నాన్న రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా విశేష సేవలందించారు. ఆయనను ముక్కలు ముక్కలుగా మా ఇంటికి తీసుకొచ్చారు’’ అంటూ ఎమోషన్‌ను ప్రియాంక కంట్రోల్ చేసుకోలేకపోయారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలిచ్చారని చెప్పారు. ‘‘ఇలాంటి ఎందరో మహామహులైన ప్రధానులను నేను చూశాను. కానీ మోడీ లాంటి అబద్ధాల కోరుల్ని మాత్రం చూడలేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘మన్మోహన్ సింగ్ లాంటి ప్రధాని ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇక ఇతర పార్టీల నుంచి ప్రధానులు అయిన గొప్ప నాయకుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నారు. కానీ మోడీ చాలా విభిన్నం. ఆయన దేశం ముందు, ప్రజల ముందు అబద్ధాలు ఆడుతున్నారు. నిజం చెప్పాలని అనుకోవడం లేదు’’ అంటూ ప్రియాంక తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘దేశ సంపదను ఎక్కువ పిల్లలున్నోళ్లకు పంచుతారు, మంగళసూత్రాల్నీ లాక్కుంటారు’’ అంటూ ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో మోడీ చేసిన వ్యాఖ్యలకు ఈవిధంగా ప్రియాంక కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News