Hyper Sonic Missile ప్రయోగం సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్

భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.

Update: 2024-11-17 04:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్మీ కోసం రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ హైపర్‌సోనిక్ మిస్సైల్ 1,500కు పైగా పేలోడ్‌లను మోసుకెల్లగలదు. హైదరాబాద్‌లోని అబ్దుల్ కలాం మిస్సైల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో దీన్ని రూపొందించారు. ఇక ఈ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ గురించి ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ‘‘ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ స్టేషన్ నుంచి హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. దీంతో భారత్ అదిపెద్ద మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. ఇది హిస్టారికల్ మూవ్‌మెంట్. సైంటిస్టులను అభినందిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.


Similar News