మానవత్వం చాటిన పోలీసులు.. కూతురు ఫోన్‌తో కదిలిన పోలీసులు

ఎప్పుడు నేరస్తులను వెంటాడే పోలీసులు కొన్ని సందర్భాల్లో మానవత్వం కూడా చాటుతున్నారు. తాజాగా ఒక తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన యూపీ పోలీసులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

Update: 2024-05-28 10:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడు నేరస్తులను వెంటాడే పోలీసులు కొన్ని సందర్భాల్లో మానవత్వం కూడా చాటుతున్నారు. తాజాగా ఒక తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన యూపీ పోలీసులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఓ హృదయవిదారకర ఘటన జరిగింది. అనారోగ్యం కారణంగా తన తండ్రి చనిపోయాడని, చుట్టాలు, డబ్బులు, మిత్రులు ఎవరు లేరు ఆదుకోవాలని ఓ కూతురు యూపీ పోలీసులకు కాల్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

కూతురు ఫోన్‌తో కదిలిన పోలీసులు స్థానికుల సహాయంతో చివరి ఘట్టం పూర్తి చేశారు. అయితే పోలీసులు తమ భుజంపై పాడే మోస్తున్న ఫోటోలు యూపీ పోలీసులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు గ్రేట్ వర్క్ అంటూ, సెల్యూట్ చెబుతూ పోలీసులను ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News