ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం..
సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన OPD బ్లాక్లో జరిగింది.
దిశ, వెబ్డెస్క్: సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన OPD బ్లాక్ లో జరిగింది. అయితే కొత్త బ్లాక్ కావడంతో ఇంతటి భారీ అగ్నిప్రమాదం అయినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే దీని గురించిన సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగిందా.. లేదా.. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.