మానవత్వం చాటుకున్నCM స్టాలిన్.. కేరళ ప్రభుత్వానికి భారీ ఆర్థిక సహయం
కేరళ రాష్ట్రంలో వరద విలయ తాండవం చేసిన విషయం తెలిసిందే. సోమవారం కురిసిన కుండపోత వర్షాల వల్ల వయనాడ్‌లోని పలు
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో వరద విలయ తాండవం చేసిన విషయం తెలిసిందే. సోమవారం కురిసిన కుండపోత వర్షాల వల్ల వయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 60 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మరి కొందరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా వందలమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత ఆర్మీ, నేవీ రంగంలోకి దిగాయి.
ముమ్మరంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. వర్షాలు, వరదలతో పొరుగు రాష్ట్రం కేరళ అల్లకల్లోలం అవుతోన్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మానవత్వం చాటుకున్నారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి స్టాలిన్ సర్కార్ ఆర్థిక సహయం చేసింది. కేరళకు స్టాలిన్ రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహయక చర్యల్లో పాల్గొనేందుకు ఇద్దరు ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కేరళ రాష్ట్రానికి పంపనున్నట్లు తెలిపారు. కొండ చరియలు విరిగిపడి మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.