నెహ్రూ నేమ్‌తో కాదు.. కృషితో ఫేమస్ అయ్యారు : Rahul Gandhi

"నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ" పేరును "ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ"గా మార్చడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

Update: 2023-08-17 11:27 GMT

న్యూఢిల్లీ : "నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ" పేరును "ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ"గా మార్చడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. "నెహ్రూ తాను చేసిన కృషితో ప్రసిద్ధి చెందారు. ఆయన పేరు వల్ల కాదు" అని అన్నారు. ఇలాంటి పేర్లు మార్చే పాలసీ వల్ల మోడీ ప్రభుత్వం దేశ ప్రజల దృష్టిలో చులకన అవుతోందని కామెంట్ చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పందిస్తూ.. "ప్రధాని మోడీకి చాలా భయాలు, అభద్రతా భావాలు ఉన్నాయి. తొలి ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ అజెండాగా పెట్టుకుంది.

ప్రధాని మోడీ ఎన్‌(N)ను పీ (P)గా మార్చారు. పీ అంటే చిన్నతనం (పెట్టీనెస్)" అని విమర్శించారు. "ఇతర ప్రధానులకు స్థానం కల్పించేందుకు భారత తొలి ప్రధాని పేరును తీసేయడం చాలా చిన్న పని. అయినా ఫర్వాలేదు.. దీనిని నెహ్రూ మెమోరియల్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పిలుచుకోవచ్చు" అని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. కాగా, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. నెహ్రూ నుంచి మోడీ వరకు ఎంతోమంది ప్రధానమంత్రులు దేశానికి చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించిన విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని వివరించింది.

Tags:    

Similar News