భారత్ రెండు చట్టాలపై ఎలా నడుస్తుంది.. కోర్టు కూడా UCCని అమలు చేయమంటుంది: PM Modi
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం భోపాల్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గోన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత్ ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం భోపాల్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా ప్రధాని యూనిఫాం సివిల్ కోడ్‌కు అనుకూలంగా మాట్లాడాడు. ఒకే ఇంట్లో రెండు వేరు వేరు చట్టాలు ఉంటే ఇల్లు ఎలా పని చేయగలదని ప్రశ్నించారు. దేశం రెండు చట్టాలపై ఎలా నడుస్తుంది?" యూసీసీని ఉపయోగించి కొన్ని పార్టీలు ముస్లింలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. యూసీసీని అమలు చేయాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పిందని ఆయన అన్నారు.
Read More..
ప్రధాని మోడీపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్
మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు.. వైట్ హౌస్ రియాక్షన్ ఇదే!