Mamata Banerjee : మీకెంత ధైర్యం.. మమ్మల్నే బెదిరిస్తారా ? : మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అసోం సీఎం రియాక్షన్

దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మండిపడ్డారు.

Update: 2024-08-28 14:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మండిపడ్డారు. రాష్ట్రంలోని డాక్టర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు మమత యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే డాక్టర్ల కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. పాస్‌పోర్టులు, వీసాలు పొందడం కష్టమైపోతుంది’’ అంటూ దీదీ చేసిన వ్యాఖ్యలను సుధాంశు త్రివేది తప్పుపట్టారు. డాక్టర్ల గురించి మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యల్లో స్పష్టమైన హెచ్చరిక దాగి ఉందన్నారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సీఎం మమత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

‘‘ఒకవేళ బెంగాల్‌‌‌లో మంటలు అలుముకుంటే.. అవి అసోం, ఢిల్లీలనూ తాకుతాయి’’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మండిపడ్డారు. ‘‘దీదీజీ.. అసోంను బెదిరించే ధైర్యం మీకెలా వచ్చింది ? మీ కళ్లతో మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయొద్దు. బెంగాల్‌లో మీ రాజకీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు దేశాన్ని మంటల్లోకి నెట్టొద్దు. దేశాన్ని విభజించేలా మాట్లాడటం మీకు తగదు’’ అని అసోం సీఎం హిమంత విమర్శలు గుప్పించారు. 


Similar News