అరుణాచల్ ప్రదేశ్‌లో 15 మంది మిలిటెంట్ల సరెండర్..

Update: 2023-03-12 16:43 GMT

ఈటా నగర్: అరుణాచల్ ప్రదేశ్‌‌లో ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్‌కు చెందిన 15 మంది మిలిటెంట్లు లొంగిపోయారు. ఆదివారం రాజధాని ఈటా నగర్‌లో సీఎం ఫేమా ఖాండు సమక్షంలో అధ్యక్షుడు తోష మూసంగ్‌తో సహా లొంగిపోయినట్లు అధికారులు చెప్పారు. వీరంతా ఆయుధాలతో పోలీస్ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అయినట్లు తెలిపారు. ఈ సంఘటనను చారిత్రాత్మకమని సీఎం ఫేమ ఖాండు వర్ణించారు.

హింసను విడనాడి జాతీయ స్రవంతిలో చేరేందుకు కార్యకర్తలను ఒప్పించడంలో అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసుల చర్చల ప్రయత్నాలను కొలిక్కి తీసుకొచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మిలిటెంట్లు సరెండర్ కావడం స్థానికంగా శాంతి ని కొనసాగించేందుకు అసోం రైఫిల్స్ కృషికి నిదర్శనమని చెప్పారు. అన్ని సమస్యలకు తుపాకి కల్చర్ పరిష్కారం కాదని, ఇలాంటి చర్యలు సానుకూలతను ఇస్తాయని అన్నారు. లొంగిపోయిన వారికి పూర్తి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News