భారత పర్యటనలో హిల్లరీ క్లింటన్ కీలక ప్రకటన.. 50 మిలియన్ డాలర్ల డొనేషన్
భారత పర్యటనలో యూఎస్ మాజీ విదేశాంగ సెక్రటరీ హిల్లరీ క్లింటన్ కీలక ప్రకటన చేశారు.
గాంధీనగర్: భారత పర్యటనలో యూఎస్ మాజీ విదేశాంగ సెక్రటరీ హిల్లరీ క్లింటన్ కీలక ప్రకటన చేశారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు మహిళల కోసం 50 మిలియన్ డాలర్ల గ్లోబల్ క్లైమేట్ రెసిలెన్స్ ఫండ్‌ను సోమవారం ప్రకటించారు. దీని ద్వారా మహిళలు వాతావరణ మార్పులతో పోరాడటంతో పాటు కొత్త జీవనోపాధి వనరులు, విద్యను అందించడంలో సహాయపడుతుందని అన్నారు.
సోమవారం గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని కుడా గ్రామంలో పాన్ వర్కర్లతో మాట్లాడారు. సేవా, ఎలాబెన్ వంటి సంస్థలతో 30 ఏళ్లుగా పనిచేయడం గొప్ప విషయమని చెప్పారు. అయితే రాబోయే 50 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వాతావరణ మార్పులతో పుట్టుకొస్తున్న అనధికారిక రంగాల్లోని మహిళలకు వర్కర్లకు అదనపు సవాళ్లను ఇస్తుందని అన్నారు. అయితే అంతర్జాతీయ నిధుల ద్వారా దీనిని ఎదుర్కొంటామని తెలిపారు.