మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. శివ‌సేన నేత‌ సుష్మా అధారేకు త‌ప్పిన ప్ర‌మాదం

సార్వత్రిక ఎన్నికల వేళ మ‌హారాష్ట్ర‌లో ఓ ప్రైవేటు హెలికాప్ట‌ర్ కూలింది. రాయ్‌గడ్ జిల్లాలోని మహాద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

Update: 2024-05-03 07:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ మ‌హారాష్ట్ర‌లో ఓ ప్రైవేటు హెలికాప్ట‌ర్ కూలింది. రాయ్‌గడ్ జిల్లాలోని మహాద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అధారే ఆ హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ నేత‌ను తీసుకువెళ్లేందుకు వ‌స్తున్న హెలికాప్ట‌ర్‌.. ల్యాండింగ్ స‌మ‌యంలో ఆకస్మాత్తుగా కుప్ప‌కూలింది. బ్యాలెన్స్ తప్పడం వల్ల హెలికాప్టర్‌ను పైలెట్స్ అదుపు చేయలేకపోయారు. దీంతో ఖాళీ మైదానంలో ఆ హెలికాప్ట‌ర్ ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధం చేస్తూ కూలింది.

దీనికి సంబంధించిన వీడియోలు అధికారులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఛాపర్ కూలుతున్న స‌మ‌యంలో పైలెట్స్ కింద‌కు దూకారు. ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. వైట్ అండ్ బ్లూ క‌ల‌ర్‌లో ఉన్న రోట‌రీ వింగ‌ర్ ఛాపర్ ప్ర‌మాదంలో పూర్తిగా ధ్వంస‌మైంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాల‌ను ఆ ప్ర‌దేశానికి చేరుకున్నారు. శివ‌సేన లీడ‌ర్ సుష్మా అధారే కారులో ప్ర‌చారం కోసం బ‌య‌లుదేరి వెళ్లినట్లు తెలిసింది. దీంతో శివసేన నేతకు తృటిలో ప్రమాదం తప్పినట్లైంది.

Tags:    

Similar News