ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా మందుల పట్టివేత.. వ్యక్తి అరెస్ట్!

ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అదికారులు అనుమతి లేని మందులను భారీగా గుర్తించారు.

Update: 2023-05-10 10:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారులు అనుమతి లేని మందులను భారీగా గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్-3 లో ఓ ప్రయాణికుడు రెండు బ్యాగుల్లో ఉన్న మందులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో బ్యాగులను అధికారులు తనిఖీలు చేశారు. రూ. రూ.57.30 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. వకీల్ ఆహ్మద్ అనే వ్యక్తి ఈ మందులను భారత్ నుంచి బహ్రెయిన్‌కు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన అనుమతులు చూపికపోవడంతో ఆహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

Tags:    

Similar News