ముస్లిం రిజర్వేషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని ఓబీసీ కోటాలో చేరుస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మే 9కి వాయిదా వేసింది.

Update: 2023-04-25 06:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని ఓబీసీ కోటాలో చేరుస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మే 9కి వాయిదా వేసింది. రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీలకు 17 శాతం పెంచడంతో పాటు లింగాయత్-వొక్కలింగ వర్గాలకు రిజర్వేషన్లు పెంచింది. ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి.. వారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే పదిశాతం రిజర్వేషన్‌లో చేర్చింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే విచారణకు అంగీకరించింది. తాజాగా ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారమ మే 9కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఉత్తర్వుల ఆధారంగా మే 9 వరకు ఎలాంటి అడ్మిషన్లు, నియామకాలు జరగవని కర్ణాటక ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది.

Tags:    

Similar News