ద్వేషం, శత్రుత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు: ఎలా గాంధీ కీలక వ్యాఖ్యలు
ద్వేషం, శత్రుత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదని దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త, మహాత్మా గాంధీ మనుమరాలు ఎలా గాంధీ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ద్వేషం, శత్రుత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదని దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త, మహాత్మా గాంధీ మనుమరాలు ఎలా గాంధీ తెలిపారు. మతం పేరుతో వాటిని ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. గాంధీ డెవలప్‌మెంట్ అండ్ ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్ట్‌లో నిర్వహించిన సర్వమత సమావేశంలో ఆమె ప్రసంగించారు. సమాజంలో విభజన, విద్వేషాన్ని నింపే శక్తులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దయ, ప్రేమ, విశ్వాసంతో ఉండాలని ఏ గ్రంధమైనా మార్గనిర్దేశనం చేస్తుందని తెలిపారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య విభజనను సృష్టించి గాంధీని, తనను హిందూ సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వాస్తవాలను బహిరంగంగా చెప్పడం చాలా ముఖ్యని, తద్వారా ప్రస్తుతం జరుగుతున్న దుష్ర్పచారాలను అరికట్టవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూ ప్రార్థనలను పఠించాలని పలువురు హిందూ నేతలను ఆహ్వానించానని, కానీ వారు దానిని తిరస్కరించారని అన్నారు. కాగా, ఎలా గాంధీ ప్రస్తుతం గాంధీ డెవలప్‌మెంట్ అండ్ ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.