HAL : ‘సఫల్‌’తో ‘హాల్’ ఒప్పందం.. ‘ఆరావళి’ హెలికాప్టర్ ఇంజిన్ల తయారీ కోసం జట్టు

దిశ, నేషనల్ బ్యూరో : హెలికాప్టర్ ఇంజిన్ల కోసం మనదేశం ఇంతకుముందు విదేశాలపై ఆధారపడేది.

Update: 2024-08-30 13:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హెలికాప్టర్ ఇంజిన్ల కోసం మనదేశం ఇంతకుముందు విదేశాలపై ఆధారపడేది. ఇతర దేశాల నుంచే వాటిని దిగుమతి చేసుకునేది. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. భారత్‌లోనే కొన్ని హెలికాప్టర్లకు సంబంధించిన ఇంజిన్ల తయారీ మొదలైంది. తాజాగా శుక్రవారం రోజు సఫల్ హెలికాప్టర్ ఇంజిన్స్ కంపెనీతో భాారత్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) ఓ కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి ‘ఆరావళి’ పేరుతో అత్యాధునిక హెలికాప్టర్ ఇంజిన్ల అభివృద్ధి, డిజైనింగ్, తయారీ, సప్లై విభాగాల్లో పనిచేయనున్నాయి.

ఈ ఇంజిన్లను భారత్‌కు చెందిన పలు హెలికాప్టర్లలో వినియోగించనున్నారు. ఈ ఒప్పందంపై హాల్ హెలికాప్టర్ విభాగం సీఈవో ఎస్.అంబువేలన్, సఫల్ కంపెనీ డైరెక్టర్ ఒలీవియర్ సవిన్ సంతకాలు చేశారు. సఫ్రన్ హెలికాప్టర్స్ అనే ఫ్రాన్స్ కంపెనీ, భారత్‌కు చెందిన హాల్ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ పేరు ‘సఫల్’. ఇప్పుడు దీనితోనే హాల్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.


Similar News