అలర్ట్: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. అక్కడ పాఠశాలలకు 10 రోజులు సెలవులు!

హంకాంగ్ ​ఫ్లూగా పిలుస్తున్న హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది.

Update: 2023-03-15 12:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హంకాంగ్ ​ఫ్లూగా పిలుస్తున్న హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది. ఇటీవలే ఈ వైరస్​బారిన పడి కర్ణాటక, హరియాణా, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెలువులు మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. హెచ్‌3ఎన్‌2 వైరస్ వ్యాప్తి దృష్ట్యా 10 రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. ఈ సెలవులు మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌కు సంబంధించి పుదుచ్చేరిలో 79 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.

Tags:    

Similar News