రెండు గదుల ఇంటికి 20 లక్షల కరెంట్ బిల్.. ఖంగుతిన్న కుటుంబం

తమ చిన్న ఇంటికి వచ్చిన 20 లక్షల కరెంట్ బిల్ చూసి ఖంగుతున్నది ఓ కుటుంబం.

Update: 2024-08-11 12:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమ చిన్న ఇంటికి వచ్చిన 20 లక్షల కరెంట్ బిల్ చూసి ఖంగుతున్నది ఓ కుటుంబం. వివరాల్లోకి వెళితే..గుజరాత్ లోని నవసారిలో నలుగురు నివసించే రెండు గదుల ఇంట్లో నాలుగు ఫాన్లు, నాలుగు బల్బులు, ఓ చిన్న ఫ్రిజ్, టివి ఉన్నాయి. వీరికి ఎప్పుడు కూడా రూ. 2000 లోపే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ గుజరాత్ పవర్ కంపెనీ జారీ చేసిన జూన్-జూలై 2024 కు సంబంధించిన బిల్లు మాత్రం 20,01,902 రూపాయలు రావడంతో ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. పెట్రోల్ పంపులో పనిచేస్తున్న ఆ ఇంటి యజమాని పంక్తిబెన్ పటేల్ మాట్లాడుతూ.. మా ఇంట్లో చాలా తక్కువ ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి. వాటిని కూడా మేము తక్కువగా వాడతాం. ఇంట్లో వాళ్ళంతా పగలు పని చేయడానికి బయటికి వెళితే తిరిగి వచ్చేది సాయంత్రానికే. కాని ఇంత బిల్లు రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఈ విషయాన్ని గుజరాత్ కరెంట్ బోర్డు దృష్టికి తీసుకు వెళ్ళగా.. మరోసారి మీటర్ ను పరిశీలించగా.. మీటర్లో తప్పుడు రీడింగ్ వల్ల అంత బిల్ వచ్చిందని వివరించారు. తర్వాత మీటర్ ను సరిదిద్ది సరైన బిల్ ఇచ్చారు అధికారులు.


Similar News