Pakisthan : లాహోర్లో స్కూళ్లు మూసివేసిన ప్రభుత్వం
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సు లాహోర్(Lahore)లో గాలి కాలుష్యం(Air Pollution) డేంజర్ బెల్స్ దాటిపోయాయి.
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సు లాహోర్(Lahore)లో గాలి కాలుష్యం(Air Pollution) డేంజర్ బెల్స్ దాటిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో లాహోర్ ముందు వరుసలో నిలిచింది. దీంతో వారం రోజులపాటు ప్రైమరీ స్కూళ్ళు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. లాహోర్ నగరం మొత్తం పొగమంచుతో కమ్ముకుంది. నగర ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండాలని, కిటికీలు కూడా మూసి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ప్రావిన్సు మంత్రి మరియమ్ ఔరంగజేబ్ మీడియాకు తెలిపారు.