మరో రెండు కశ్మీరీ సంఘాలపై కేంద్రం బ్యాన్.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్‌లోని పాకిస్తాన్‌ను సమర్ధించే రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది.

Update: 2024-02-28 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్‌లోని పాకిస్తాన్‌ను సమర్ధించే రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. తాజాగా ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (భట్ వర్గం)లను చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈవివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ రెండు సంస్థలు భారత దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ప్రధాని మోడీ ప్రభుత్వ కృతనిశ్చయంలో భాగంగానే ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (భట్ వర్గం)లపై ఐదేళ్ల బ్యాన్‌ను అమల్లోకి తెచ్చామన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం - 1967లోని సెక్షన్ 3లో ఉన్న సబ్-సెక్షన్ (1) ద్వారా లభించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంఘాలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించిందని తెలిపారు.

Tags:    

Similar News